BJP: కిషన్‌రెడ్డికి మహాకుంభమేళా ఆహ్వానపత్రిక
ABN , Publish Date - Dec 16 , 2024 | 03:51 AM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళా ఆహ్వాన పత్రిక కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డికి అందింది.
హైదరాబాద్, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళా ఆహ్వాన పత్రిక కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డికి అందింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి ప్రతినిధి బృందం కిషన్ రెడ్డికి యూపీ ప్రభుత్వ ఆహ్వాన పత్రికను అందజేసింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాకు వివిధ దేశాల నుంచి 30 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.
కుంభమేళాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తూ కుంభమేళా కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. మహా కుంభమేళా సందర్భంగా 6 రోజుల స్నానాలను భక్తులు, సాధుసంతులు అత్యంత పవిత్రంగా భావిస్తారని తెలిపారు. కుంభమేళా ప్రారంభమయ్యే జనవరి 13(పౌర్ణమి)తో పాటు జనవరి 14(మకర సంక్రాంతి), 29(మౌని అమావాస్య), ఫిబ్రవరి 3(వసంత పంచమి), ఫిబ్రవరి 12(మాగి పౌర్ణమి), ఫిబ్రవరి 26(మహా శివరాత్రి) ఇందులో ఉన్నాయని కిషన్‌రెడ్డి వివరించారు.