Share News

Telangana temples: తెలంగాణ ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై నజర్‌

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:20 AM

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం తీవ్ర దుమారం రేపుతోంది.

Telangana temples: తెలంగాణ ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై నజర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యి నాణ్యతపై రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యి నాణ్యత పరిశీలించాలని ఆలయ అధికారులకు సోమవారం లేఖ రాశారు.


తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు బాసర సరస్వతి, వేములవాడ రాజన్న ఇతర ఆలయాల్లో నిత్యం వేలాది లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా విక్రయిస్తుంటారు. ఇందుకోసం నెయ్యి, ఇతర వస్తువుల్ని కాంట్రాక్టర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వివాదం నేపథ్యంలో ఇక్కడి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Updated Date - Sep 24 , 2024 | 03:20 AM