Share News

Payal Shankar: మాయల ఫకీరు చెబితేనే పని జరిగేది: పాయల్‌

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:09 AM

’’బాలనాగమ్మ కథలో మాయల పకీరు ప్రాణం చిలుకలో పెట్టినట్టు... ఆదిలాబాద్‌లో ఉన్న భూములు నిషేధిత జాబితాలో పెట్టాలా? వద్దా? అనే అధికారం సైతం సీసీఎల్‌ఏకే అప్పగించారు. సీసీఎల్‌ఏలోని చిలుకకు మాయల పకీరు చెబితేనే పని జరిగేది.

Payal Shankar: మాయల ఫకీరు చెబితేనే పని జరిగేది: పాయల్‌

’’బాలనాగమ్మ కథలో మాయల పకీరు ప్రాణం చిలుకలో పెట్టినట్టు... ఆదిలాబాద్‌లో ఉన్న భూములు నిషేధిత జాబితాలో పెట్టాలా? వద్దా? అనే అధికారం సైతం సీసీఎల్‌ఏకే అప్పగించారు. సీసీఎల్‌ఏలోని చిలుకకు మాయల పకీరు చెబితేనే పని జరిగేది. ఇదీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తంతు’’ అని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఆరోపించారు. ఆదిలాబాద్‌లో అడిగిన ధరకు ఇవ్వలేదన్న కారణంతో ఓ రైతు భూమిని సీసీఎల్‌ఏ సహకారంతో నిషేధిత జాబితాలో చేర్చారని, చివరకు ఆ రైతు అతి తక్కువ ధరకు భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భూ సమస్యల్ని కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించాలని కోరారు. కొత్త ఆర్వోఆర్‌ చట్టంలో అధికారులపై దావాలు వేయరాదనే క్లాజు తొలగించాలన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 05:09 AM