Happy New Year 2025: ఫుల్ కిక్‌లో మందుబాబులు.. మూడ్రోజుల్లో ఎంత తాగారంటే..
ABN , Publish Date - Dec 31 , 2024 | 02:50 PM
Happy New Year 2025: కొత్త ఏడాది మొదలవడానికి మరికొన్ని గంటలే ఉంది. న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసేందుకు అంతా సిద్ధమవుతున్నారు. పాత ఏడాది జ్ఞాపకాలు తలచుకుంటూనే.. కొత్త సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలను రెడీ చేసుకుంటున్నారు.
కొత్త ఏడాది మొదలవడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉంది. న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసేందుకు అంతా సిద్ధమవుతున్నారు. పాత ఏడాది జ్ఞాపకాలు తలచుకుంటూనే.. కొత్త సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలను రెడీ చేసుకుంటున్నారు. 2024 కంటే 2025 మరింత వైవిధ్యంగా ఉండేలా, ఎంతో రీఫ్రెషింగ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. కొత్త ఏడాది మొదటి రోజు నుంచి పెట్టుకున్న గోల్స్ అచీవ్ చేసేందుకు పరుగులు పెట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫుల్‌గా సెలబ్రేట్ చేయాలని భావిస్తున్నారు. ఆల్రెడీ మూడ్రోజుల కిందే చాలా మంది సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. మందుబాబుల ఉత్సాహం మామూలుగా లేదు. పీపాలకు పీపాలు తాగేస్తూ న్యూ ఇయర్‌కు వాళ్లు ఊహించని కిక్ ఇస్తున్నారు.
బిగ్ టార్గెట్
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా లిక్కర్ సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు ఉండే చాన్స్ ఉందని సమాచారం. గడిచిన మూడ్రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రూ.600 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. ఆల్రెడీ డిపోల నుంచి వైన్స్, బార్ షాపులకు మద్యం చేరుకుంది. వివిధ బ్రాండ్లతో భారీ స్టాక్‌తో రెడీ అయిపోయారు వ్యాపారులు. గతేడాదితో పోలిస్తే ఈసారి సేల్స్ రెట్టింపయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఏకంగా 600 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వినిపిస్తోంది. దీంతో ఎక్సైజ్ శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరడం ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం చేరింది. నిన్న ఒక్కరోజే రిటైల్‌గా కొనుగోళ్లు చేశారు షాపు యజమానులు. సోమవారం నాడు మద్యం మీద వచ్చిన ఆదాయం రూ.402 కోట్ల 62 లక్షలు. ఇంక ఇవాళ ఏ రేంజ్‌లో సేల్స్ ఉంటాయో చూడాలి.
Also Read:
వాళ్లందరికీ ఫ్రీ మీల్స్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
పబ్‌లో న్యూ ఇయర్ పార్టీ.. కండోమ్స్ పంపి ఆహ్వానాలు!
మా జీవితాల్లో అతనిది ప్రత్యేక పాత్ర
For More Telangana And Telugu News