Share News

TG Group 2 Exam: ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..

ABN , Publish Date - Dec 17 , 2024 | 07:21 AM

సోమవారం గ్రూప్-2 పరీక్షలకు ఓ గర్భిణి మహిళ హాజరయ్యారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులు వస్తున్నా..ఆ నొప్పులను భరిస్తూ పరీక్ష రాసేందుకే ఆ మహిళ నిర్ణయించుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు...మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే..

TG Group 2 Exam: ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..
Group 2 Exams

నాగర్ కర్నూల్: ఉద్యోగం (Job) సాధించాలనే తపనతో ఓ నిండు గర్భిణి (Pregnant Lady) గ్రూప్-2 పరీక్షలు (Group-2 Exam) రాస్తుండగా పరీక్ష హాలులోనే పురిటి నొప్పులు (Pelvic pain) రావడంతో అధికారులు జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. దీంతో కలెక్టర్ స్పందించి ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే అక్కడే ప్రసవం చేయాలని ఆదేశించారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం వద్ద చోటు చేసుకుంది. బాల్మూరు మండలం, బాణాలగ్రామానికి చెందిన రేవతి అనే గర్భిణికి నెలలు నిండడంతో వైద్యులు సోమవారం డెలివరి డేట్ ఇచ్చారు. అయితే అదే రోజు గ్రూప్-2 పరీక్ష ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఆమె పరీక్షలు రాసింది. ఆమెకు జిల్లా కలెక్టర్, వైద్య సిబ్బంది పూర్తిగా సహకరించడంతో రెండు పేపర్లు రాసింది.


కాగా తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు ముగిశాయి. అయితే సోమవారం గ్రూప్-2 పరీక్షలకు ఓ గర్భిణి మహిళ హాజరయ్యారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులు వస్తున్నా..ఆ నొప్పులను భరిస్తూ పరీక్ష రాసేందుకే ఆ మహిళ నిర్ణయించుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు...మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. పరీక్ష పూర్తి అయిన తర్వాతే ఆసుపత్రికి వెళ్తానని పట్టుబట్టింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే ఆమె కోసం పరీక్షా హాలు వద్ద ప్రత్యేకమైన అంబులెన్స్, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. పురిటి నొప్పులతోనే ఆమె పరీక్షలు రాశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆమెను డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.


మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని రోడ్డులోని గౌతమి స్కూల్‌ కేంద్రంలో కొమరవరపు రవికుమార్‌ సోమవారం మధ్యాహ్నం పరీక్ష రాస్తుండగా ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పరీక్ష నిర్వాహకులు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి అతడిని అంబులెన్స్‌లో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రవిని పరీక్షించి చికిత్స అందించారు. కాసేపటికి కోలుకున్న అతడిని పరీక్షా కేంద్రానికి తరలించగా పరీక్ష రాశాడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ప్రభుత్వ కళాశాలలో ఎల్‌.నగేశ్‌ అనే అభ్యర్థికి పరీక్ష రాస్తుండగానే ఫిట్స్‌ రావడంతో ఆస్పత్రికి తరలించారు. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచలో ఓ అభ్యర్థి హల్‌చల్‌ చేశాడు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అతడిని అధికారులు పరీక్షకు అనుమతించకపోవడంతో అక్కడే దుస్తులు విప్పి నిరసన తెలిపాడు. పాల్వంచలోని నెహ్రూనగర్‌ సాంఘిక సంక్షేమ గురకుల బాలికల డిగ్రీ కళాశాల సెంటర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే విధుల్లో ఉన్న అశ్వారావుపేట పోలీసులు అతడిని హెచ్చరించడంతో చివరకు వెళ్లిపోయాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాలంతో పరుగు..

గ్రూప్‌-2 ప్రశ్నలపై వివాదం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 17 , 2024 | 07:21 AM