Share News

TG Politics: రేవంత్ మరో గజిని.... బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి విసుర్లు

ABN , Publish Date - Apr 16 , 2024 | 06:48 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో గజిని.. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బీజేఎల్పీ నేత ఏలేటి‌ మహేశ్వరరెడ్డి (Maheshwar Reddy) ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు ఆయన ABNతో మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో రేవంత్‌కు రైతులపై కపట ప్రేమ కలిగిందన్నారు.

TG Politics: రేవంత్ మరో గజిని.... బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి విసుర్లు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో గజిని.. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బీజేఎల్పీ నేత ఏలేటి‌ మహేశ్వరరెడ్డి (Maheshwar Reddy) ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు ఆయన ABNతో మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో రేవంత్‌కు రైతులపై కపట ప్రేమ కలిగిందన్నారు. అద్రతాభావంతో రేవంత్ బీజేపీ, ప్రధాని మోదీపై సుఫారీ కామెంట్స్ చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.


Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!

తెలంగాణలో కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో 5 సీట్లు కూడా రావని ఇంటిలిజెన్స్ రేవంత్‌కు సమాచారం ఇచ్చిందన్నారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిన చరిత్ర రేవంత్‌దని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు రూ. 80వేల కోట్లు కావాలని అన్నారు. రుణమాఫీకి రూ.35వేల కోట్లకు పైగా నిధులను ఎలా సమకూర్చుతారో చెప్పాలని ప్రశ్నించారు. దళితులు, బీసీ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి? అని నిలదీశారు.


MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!

స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా రేవంత్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేయబోతుందని ఆరోపించారు. రైతాంగానికి బడ్జెట్‌లో కేటాయించింది రూ.19వేల కోట్లు మాత్రమేనని చెప్పారు.ఆగస్ట్ 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఎన్నికల హామీలను అమలు చేసేవరకు ప్రభుత్వం వెంట పడతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై రేవంత్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని మహేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు.


Telangana: నల్గొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మార్పు.. కొత్తగా ఎవరంటే?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 16 , 2024 | 06:48 PM