Gajwel: హరీశ్‌రావు చెప్పినవన్నీ అబద్ధాలే
ABN , Publish Date - Oct 22 , 2024 | 04:35 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పినవన్నీ అబద్ధాలేనని మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ భూనిర్వాసితులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీపై గజ్వేల్‌లో ఆదివారం
మల్లన్నసాగర్ భూనిర్వాసితుల మండిపాటు
గజ్వేల్, అక్టోబరు 21: మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పినవన్నీ అబద్ధాలేనని మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ భూనిర్వాసితులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీపై గజ్వేల్‌లో ఆదివారం హరీశ్‌రావు మాట్లాడిన మాటలకు నిరసనగా సోమవారం ఆయన బ్యానర్‌ను దహనం చేశారు. వారికి కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్ మాట్లాడుతూ.. హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడినవి పూర్తి అబద్ధమన్నారు.
ట్రాన్స్‌పోర్టేషన్ కోసం రూ.50 వేలు ఇచ్చామని చెప్పడం అబద్ధమని, కొందరు బ్రోకర్లను తయారు చేసి వాళ్లే పంచుకున్నారని ఆరోపించారు. దేశంలోనే మోడల్ ఆర్ అండ్ ఆర్ కాలనీగా తీర్చిదిద్దామని చెబుతున్నారని, కానీ కాలనీవాసులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా శ్మశానవాటిక లేదన్నారు. గుడికి, మసీదుకు వెళదామన్నా అవి లేవన్నారు. గ్రామాలను తరలిస్తున్నప్పుడు ఉపాధి కల్పిస్తామని, కంపెనీలు పెడతామని చెప్పి నట్టేట ముంచారని మండిపడ్డారు. భూనిర్వాసితుల ఉసురు ఇప్పటికే తగిలిందని, ఇంకా తగులుతుందన్నారు.