TS NEWS: కేంద్రమంత్రులతో భట్టి విక్రమార్క భేటీ .. కారణమిదే..?
ABN , Publish Date - Mar 07 , 2024 | 11:02 PM
గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం తప్పిదాల వల్ల సింగరేణి (Singareni)కి భారీ నష్టం వాటిళ్లిం దని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. త్వరలోనే తాడిచెర్ల కోల్ బ్లాకు అనుమతులకు ఆదేశాలు ఇస్తామని కేంద్ర బొగ్గు శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారని తెలిపారు. గురువారం నాడు కేంద్ర బొగ్గు శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి,కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్‌ని భట్టి విక్రమార్క కలిశారు.
ఢిల్లీ: గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం తప్పిదాల వల్ల సింగరేణి (Singareni)కి భారీ నష్టం వాటిళ్లిం దని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. త్వరలోనే తాడిచెర్ల కోల్ బ్లాకు అనుమతులకు ఆదేశాలు ఇస్తామని కేంద్ర బొగ్గు శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారని తెలిపారు. గురువారం నాడు కేంద్ర బొగ్గు శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి,కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్‌ని భట్టి విక్రమార్క కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి సమస్యలు, సింగరేణికి కావలసిన కోల్ బ్లాక్ కేటాయింపులపై చర్చించానని తెలిపారు. చాలా ఏళ్ల నుంచి తాడిచెర్ల రెండో కోల్ బ్లాక్, జయశంకర్ భూపాలపల్లి సింగరేణికి సంబంధించిన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.2013లోనే బ్లాక్‌ల కేటాయింపు జరిగిందన్నారు. తాడిచర్ల బ్లాక్‌లో మైనింగ్ జరపడానికి అనుమతుల కోసం కేంద్రాన్ని కోరామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా కేంద్రం నుంచి అనుమతులు తీసుకోలేదని అన్నారు. ఫలితంగా తాడిచెర్ల కోల్ బ్లాకులో మైనింగ్ చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని అన్నారు. తాటిచెర్ల కోల్ బ్లాకులో ఐదు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ దాని వినియోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖజానా నష్టపోయిందని మండిపడ్డారు.
2013లోనే తాడిచర్ల కోల్ బ్లాకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపు జరిగిందని దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశానని తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి, సింగరేణికి ఒక మంచి శుభవార్త అని చెప్పారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ రాష్ట్రానికి కేటాయింపు జరిగినప్పటికీ మైనింగ్‌కు కావలసిన అనుమతులు ఇప్పటివరకు గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. మైనింగ్ అనుమతులు తెచ్చుకోకపోవడంతో తెలంగాణ రాష్టానికి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పారు. జైపూర్ పవర్ ప్లాంట్ కోసం నైని కోల్ బ్లాకును కేంద్రం గతంలో కేటాయించిందని గుర్తుచేశారు. జైపూర్ పవర్ ప్లాంట్ ప్రారంభమైన నైని గోల్డ్ బ్లాక్ వినియోగంలోకి రాలేదన్నారు. దాంతో సింగరేణి సంస్థకు అదనపు భారం పడుతుందని చెప్పారు. ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి