Share News

TG Elections: కాంగ్రెస్ అంటేనే స్కాములు.. సీఎం రేవంత్‌పై మందకృష్ణ మాదిగ ఆగ్రహం

ABN , Publish Date - Apr 21 , 2024 | 06:43 PM

కాంగ్రెస్ (Congress) హయాం మొత్తం స్కామ్‌లే‌నని ఎమ్మార్పీఎస్ అభ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) ఆరోపించారు. ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ, బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరయ్యారు.

TG Elections: కాంగ్రెస్ అంటేనే స్కాములు.. సీఎం రేవంత్‌పై మందకృష్ణ మాదిగ ఆగ్రహం

మహబూబ్‌నగర్: కాంగ్రెస్ (Congress) హయాం మొత్తం స్కామ్‌లే‌నని ఎమ్మార్పీఎస్ అభ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) ఆరోపించారు. ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ, బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... మహబూబ్‌నగర్‌లో అరుణ గెలుపు బాధ్యత ఎమ్మార్పీఎస్ తీసుకుంటుదని తెలిపారు.


MLA Vivekananda: రేవంత్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

షెడ్యూల్డ్ ‌కులాల వర్గీకరణ కోసం ప్రధానిమంత్రి నరేంద్రమోదీ భరోసాను ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. మోదీ ఎస్సీ వర్గికరణ హామీని ‌నిలబెట్టుకుంటారని తాను‌ విశ్వసిస్తున్నానని తెలిపారు. ప్రధాని మోదీతోనే తమ జాతి, ఈ దేశ సంక్షేమం ఆధారపడి ఉందన్నారు. మాదిగల వర్గీకరణ కోసం ఎందరో రాజకీయ‌ నాయకులను‌ కలిశామని గుర్తుచేశారు.


Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్‌ ఆటలు సాగనివ్వను...

కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసిందని విరుచుకుపడ్డారు. 2013లో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఇచ్చిన‌మాట నిలుపుకోకుండా మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలో‌ ఉన్నప్పుడు పార్లమెంట్‌లో బిల్లు పెట్టలేదని.. ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ పార్టీ మాదిగలను ‌మోసం చేసిందన్నారు. మాట ఇస్తే నిలుపుకునే వారిలో మోదీని మించినోళ్లు లేరని అన్నారు.


Jaggareddy: శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే..

ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అయోధ్య రామ మందిరం నిర్మాణం, 371 ఆర్టికల్ రద్దు, అగ్రకులాలకు రిజర్వేషన్ ఇలా ఎన్నో అమలు చేశారని అభివర్ణించారు. అందుకే మోదీ మాటపై తమకు నమ్మకం ఉందన్నారు. ప్రధాని మోదీ మాదిగల సమస్యలు వినేందుకు తమ వద్దకే వచ్చారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్‌కు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని అయినా.. మాదిగలకు న్యాయం జరగదన్నారు.


Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

మోదీ ప్రధాని అయితేనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మోదీ హయాంలో ఏ స్కామ్ వెలుగు చూసినా జైలుపాలేనని హెచ్చరించారు. రాహుల్ గాంధీని మాదిగలు విశ్వసించలేమని చెప్పారు. మాదిగలను‌ ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని నమ్మబోమని అన్నారు. షెడ్యూల్డ్ కులాల్లో 70 శాతం ఉన్న మహబూబ్‌నగర్‌లో ఒక్క సీటు‌ కూడా కాంగ్రెస్ ఎందుకు కేటాయించలేదని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.


Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది: డీకే అరుణ

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలు అభివృద్ధి సాధిస్తారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ (DK Aruna) అన్నారు. మోదీ హామీని నమ్ముతూ తమకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన మందకృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ‌ఈ సమస్యను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.ఈ సమస్య తీవ్రతను గుర్తించిన మోదీ మాదిగలకు ఒక భరోసాను ఇచ్చారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని డీకే అరుణ అన్నారు.


Hyderabad: రూ.40 వేలేనా.. ఇంకేం లేదా?!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 21 , 2024 | 06:44 PM