Share News

Manuguru: వణికిస్తున్న పోస్ట్‌ వైరల్‌ ఫీవర్స్‌..

ABN , Publish Date - Oct 18 , 2024 | 01:33 PM

పినపాక ఏజెన్సీ ప్రాంతంలో పోస్ట్‌ వైరల్‌ ఫీవర్స్‌(Post viral fever) ప్రజలను వణికిస్తున్నాయి. మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకగూడెం తదితర మండలాల్లో కొత్తగా వస్తున్న జ్వరాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Manuguru: వణికిస్తున్న పోస్ట్‌ వైరల్‌ ఫీవర్స్‌..

- కాళ్లవాపులు, మణికట్టు, ఒళ్లునొప్పులు

- వారంనుంచి ఆరు నెలల వరకు ఇబ్బందులు..

- పినపాక ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు

మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): పినపాక ఏజెన్సీ ప్రాంతంలో పోస్ట్‌ వైరల్‌ ఫీవర్స్‌(Post viral fever) ప్రజలను వణికిస్తున్నాయి. మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకగూడెం తదితర మండలాల్లో కొత్తగా వస్తున్న జ్వరాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాళ్లు వాచిపోయి నడవడమే కష్టంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి జ్వరాలన వైద్యులు పోస్ట్‌ వైరల్‌ ఫీవర్స్‌ అంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Kothagudem: హోమ్ వర్క్ చేయకపోతే మరీ ఇంత దారుణంగా కొడతారా.. వైరల్ అవుతున్న వీడియో..


భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే పలుసార్లు వైరల్‌ ఫీవర్లు, సీజినల్‌ వ్యాదులపై గ్రామాల్లో ర్యాపిడ్‌ సర్వేలు నిర్వహించిన వైద్యాధికారులు మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యా, టైపాయిడ్‌(Malaria, dengue, chicken pox, typhoid) వంటి జ్వరాలు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ క్రమంలోనే జ్వరం వచ్చిన కొందరిలో పోస్టు వైరల్‌ ఫీవర్‌ అనే లక్షణాలు ఉంటున్నాయని, వీటి వల్లనే ఒళ్లు నొప్పులు, కాళ్ల వాపులు ఉంటున్నాయని చెబుతున్నారు. సుమారు పదేళ్ల క్రితం చికెన్‌గున్యాతో ఇబ్బందిపడ్డ ఏజెన్సీ ప్రజలు ఇప్పుడు పోస్ట్‌ వైరల్‌ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

mngr1.jpg


పారిశుధ్య సమస్యలు.. దోమల వ్యాప్తే కారణం..

ఏజెన్సీ గ్రామాల్లో అపరిశుభ్ర వాతారణం, పారిశుధ్యం సమస్యలే జ్వర విజృంభణకు కారణమని వైద్యులు చెబుతున్నారు. పరిసరాల్లో అపరిశుభ్రత పెరిగిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయన్నారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్త్రతలు తీసుకోక పోవడంతో దోమల వ్యాప్తి పెరిగి ప్రజలు జ్వరాల భారిన పడుతున్నారు.


లక్షణాలు ఇవే..

జ్వరంతో ప్రారంభమై ఒళ్లు నొప్పులు, కాళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసించి బలహీనమవ్వడం ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా కండరాలు, ఎముకల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. జ్వరం సోకిన వారిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే ఇవి తగ్గేందుకు వారం రోజులు పడుతుం ది. రోగనిరోదక శక్తి సరిగా లేనివారికి మాత్రం ఆరు వారాల వర కు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మణుగూరు ఏరియా ఆసుపత్రికి పినపాక ఏజెన్సీతో పాటు ములుగు జిల్లా నుంచీ జ్వర బాధితులు వచ్చి చికిత్స పొందుతున్నారు. అనేకమం ది పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిల్లోనూ చికిత్స పొందుతున్నారు.


ఖర్చుతో కూడుకున్న వైద్యం

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితుల్లో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇలాంటి కొత్త జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ జ్వరాన్ని తగ్గించుకునేందుకు ఎక్కడి వెళ్లాలో తెలియక ఆయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం జ్వరం వస్తే రెండు నుంచి మూడు వేలకు వరకు ఖర్చవుతోంది. మలేరియా, తదితర జ్వరాల నిర్దార్ణ పరీక్షలకు సుమారు రూ.600 వరకు ఖర్చవుతోంది.


ఆ తర్వాత మందులు, ఇతర ఆసుపత్రి చార్జీలు కలుపు కొని వేలాది రూపాయాలు చెల్లించాల్సి వస్తోందని కొందరు బాధితులు ‘ఆంద్రజ్యోతి’కి తెలిపారు. మణుగూ రు వైద్యాధికారి డి. శివకుమార్‌ను వివరణ కోరగా ఈ విధమైన కేసులు రోజుకు 20 వరకు వస్తున్నాయని, రక్త నమూనాలు సేకరించి కొత్తగూడెం పంపిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మురుగు నీటి కాలువలు శుభ్రంగా లేకపొండం, దోమకాటు వల్ల ఇలాంటి జ్వరాలు వస్తాయన్నారు. ఇలాంటి జ్వర బాధితులు పూర్తిగా కోలుకునేందుకు ఆరు వారాల నుంచి ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు.


ఇదికూడా చదవండి: BJP: కిషన్‌రెడ్డిపై అనుచిత వీడియోలు తొలగించాలి

ఇదికూడా చదవండి: Vijay Babu: కేసీఆర్‌ వల్లే చిన్న లిఫ్టులు నిర్వీర్యం

ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు

ఇదికూడా చదవండి: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 18 , 2024 | 01:33 PM