Share News

TG News: ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చిన యువతిపై దారుణం

ABN , Publish Date - Nov 04 , 2024 | 11:01 AM

Telangana: డిగ్రీ ఫస్ట్‌ ఇయర్ చదవుతున్న ఓ విద్యార్థిని ఎగ్జామ్ రాసేందుకు కాలేజ్‌కు వచ్చింది. అయితే ఆమె వెంటే ఉన్న అపాయాన్ని గుర్తించ లేకపోయింది విద్యార్థిని. ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న సమయంలో యువతికి అనుకోని ప్రమాదం ఎదురైంది. తప్పించుకుందామని అనుకునే లోపే తీవ్ర గాయాలపాలైంది సదరు యువతి.

TG News: ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చిన యువతిపై దారుణం
A young man attacked a young woman with a knife Medak

మెదక్, నవంబర్ 4: రాను రాను సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఉన్నతచదవులు చదివేందుకు తమ ఇంటి ఆడబిడ్డలను తల్లిదండ్రులు కాలేజీలు, స్కూళ్లకు పంపిస్తున్నారు. కానీ వారు ఇంటి వచ్చే వరకు కూడా పేరెంట్స్ భయంతో గడపాల్సిన పరిస్థితులు నేటి సమాజంలో ఎదురవుతున్నాయి. ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో, ప్రేమ పేరుతో హింసిస్తారో, లైంగిక దాడికి పాల్పడతారో అనే భయంతో తల్లిదండ్రులు గడుపుతున్నారు. కొందరు ప్రేమ పేరుతో యువతులకు నరకం చూపిస్తారు. ప్రేమించాలంటూ వెంటపడుతూ నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు.

Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


ఒప్పుకోకపోతే ఎంతటి దారుణాలకైనా తెగబడేందుకు సిద్ధమవుతారు ప్రేమోన్మాదులు. యువతులపై అత్యాచారాలకు పాల్పడటంతో లేదా వారిపై కత్తులతో, యాసిడ్‌తో దాడులు చేయడం లాంటివి చేస్తుంటారు. ఇప్పటికే ప్రేమ్మోన్మాదుల దాడులకు అనేక మంది అబలలు బలయ్యారు కూడా. యాసిడ్‌ దాడులతో మరికొందరు యువతులు తమ భవిష్యత్తును కోల్పోయిన పరిస్థితి. ఆడిపిల్లల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడో చోట ప్రేమోన్మాదానికి బలవుతూనే ఉన్నారు యువతులు. తాజాగా మెదక్‌ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.


అసలేం జరిగిందంటే...

డిగ్రీ ఫస్ట్‌ ఇయర్ చదవుతున్న ఓ విద్యార్థిని ఎగ్జామ్ రాసేందుకు కాలేజ్‌కు వచ్చింది. అయితే ఆమె వెంటే ఉన్న అపాయాన్ని గుర్తించ లేకపోయింది విద్యార్థిని. ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న సమయంలో యువతికి అనుకోని ప్రమాదం ఎదురైంది. తప్పించుకుందామని అనుకునే లోపే తీవ్ర గాయాలపాలైంది సదరు యువతి. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది.


దివ్యవాణి అనే అమ్మాయిపై ఓ యువకుడు దాడి చేసి పరారయ్యాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని దివ్య .. ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు ప్రభుత్వ కాలేజీకి వచ్చింది. అయితే యువతిని చేతన్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. తనను ప్రేమించాలంటూ గత కొద్దిరోజులు ఆమె వెంటపడుతూ ఇబ్బందులకు గురిచేశాడు. అయితే చేతన్‌ ప్రేమను దివ్య అంగీకరించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన చేతన్ ఆమెపై దాడికి ప్లాన్ వేశాడు. ఎగ్జామ్ రాసేందుకు యువతి కాలేజ్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న యువకుడు.. అక్కడే కాపు కాశాడు. విద్యార్థిని కాలేజ్‌లోకి రాగానే.. తనను ప్రేమించాలంటూ మరోసారి బలవంతం చేశాడు. ఇందుకు యువతి ఒప్పుకోకపోవడంతో అప్పటికే తెచ్చిపెట్టుకున్న కత్తితో అమ్మాయి చేయి కోసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే తోటి విద్యార్థులు అక్కడకు చేరుకుని గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. అయితే యువతిపై దాడికి పాల్పడిన ప్రేమోన్మాది బెంగుళూరుకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

YCP Leader Arrest: శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో వైసీపీ నేత అరెస్టు

India's Cleanest Air City: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి వీచే నగరాలివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 11:08 AM