Share News

Crime News: భార్య, పిల్లలకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న కానిస్టేబుల్

ABN , Publish Date - Dec 29 , 2024 | 09:57 AM

సిద్దిపేట: పట్టణం కలకుంట కాలనీలో విషాదం నెలకొంది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పండరి బాలకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యా పిల్లలకు విషమిచ్చి.. కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ ఉరి వేసుకున్నాడు. కానిస్టేబుల్ మృతి చెందగా.. ఆయన భార్యా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Crime News: భార్య, పిల్లలకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న కానిస్టేబుల్
Conistable Family Suicide Attempt

సిద్దిపేట: పట్టణం కలకుంట కాలనీ (Kalakunta Colony)లో దారుణం (Atrocity) జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబం (AR Conistable Family) ఆత్మహత్యకు (Suicide Attempt) పాల్పడింది. భార్యా పిల్లలకు విషమిచ్చి.. కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ ఉరి వేసుకున్నాడు. కానిస్టేబుల్ మృతి చెందగా.. ఆయన భార్యా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిరిసిల్ల 17వ బెటాలియన్‌కు చెందిన పండరి బాలకృష్ణకు భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కుటుంబంతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి తర్వాత ఉరివేసుకున్న బాలకృష్ణ మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు స్పృహతప్పిపోయిన కానిస్టేబుల్ భార్యా పిల్లలను హుటాహటిన సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ఇది కూడా చదవండి: నిజామాబాద్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

కానిస్టేబుల్ బాలకృష్ణ పిల్లలు యశ్వంత్ (11), ఆశ్రిత్ (9). కాగా భార్యా, పిల్లలు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలకృష్ణ వృత్తి రీత్యా సిరిసిల్లలో పని చేస్తున్నప్పటికీ, సిద్ధిపేటలో నివాసం ఉంటున్నారు. కానిస్టేబుల్ కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో తెలియరాలేదు. అతని భార్య, పిల్లలు స్పృహలోకి వచ్చి చెబితే వివరాలు తెలిసే అవకాశముంది. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులే కారణంగా ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..


ఈ వార్తలు కూడా చదవండి..

కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు

కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్

తారలు.. దిగివచ్చిన వేళ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 29 , 2024 | 10:24 AM