Share News

Medak: మెదక్ జిల్లాలో నేడు పర్యటించనున్న ప్రముఖులు వీరే..

ABN , Publish Date - Dec 25 , 2024 | 09:27 AM

మెదక్: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) పర్యటించనున్నారు. నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా చేరుకుంటారు.

Medak: మెదక్ జిల్లాలో నేడు పర్యటించనున్న ప్రముఖులు వీరే..
CM Revanth Reddy

మెదక్: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) పర్యటించనున్నారు. నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలోని ఏడుపాయలకు చేరుకోనున్నారు. ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని దర్శించుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు.


ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. చర్చి శతాబ్ది ఉత్సవాలు, క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతుండడంతో ఆయా కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొనున్నారు. ప్రార్థనా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా మెదక్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


మరోవైపు మెదక్ జిల్లాలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నేడు పర్యటించనున్నారు. కౌడిపల్లి మండలం తునికి కృషివిజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:15కి హెలికాప్టర్ ద్వారా ఉపరాష్ట్రపతి, గవర్నర్ తునికి చేరుకోనున్నారు. సేంద్రీయ వ్యవసాయంపై 800 మంది రైతులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Today Gold Rates: గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Hanumakonda: ఇంటర్ మెుదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య.. విషయం ఇదే..

Updated Date - Dec 25 , 2024 | 09:28 AM