Share News

Lagacharla Case: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

ABN , Publish Date - Dec 20 , 2024 | 07:37 AM

సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం లగచర్ల రైతులు విడుదల కానున్నారు. కాగా నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం రైతులకు బెయిలు మంజూరు చేసింది. గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిలు పత్రాలు అందాయి. దీంతో నిన్న రైతులు విడుదల కాలేదు. ఈ రోజు విడుదలవుతారు.

Lagacharla Case: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

సంగారెడ్డి జిల్లా: జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఘటన (Lagacharla Case)లో రిమాండ్‌లో ఉన్న నిందితులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు (Nampally Court Grants Bail) చేసిన విషయం తెలిసిందే. సంగారెడ్డి సెంట్రల్ జైలు (Sangareddy Central Jail) నుంచి శుక్రవారం లగచర్ల రైతులు విడుదల కానున్నారు. కాగా నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం రైతులకు బెయిలు మంజూరు చేసింది. గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిలు పత్రాలు అందాయి. దీంతో నిన్న రైతులు విడుదల కాలేదు. ఈ రోజు విడుదలవుతారు. జైలు బయట రైతులకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.


లగచర్ల కేసులో ప్రధాన నిందితుడు, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు.. మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. నరేందర్‌రెడ్డికి రూ.50 వేల చొప్పున రెండు ష్యూరిటీలను సమర్పించాలని, 3 నెలల పాటు ప్రతీ వారం బొంరాస్‌పేట ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరై, విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. మిగతా నిందితులు రూ.20 వేల ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతివారం పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది.


నరేందర్‌రెడ్డి చర్లపల్లి జైలులో.. ఏ2 సురేశ్‌రాజ్‌ సహా.. మిగతా నిందితులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. వీరి బెయిల్‌ పిటిషన్లపై బీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ సభ్యులు లక్ష్మణ్‌, శుభప్రద్‌ పటేల్‌, రాంచందర్‌రావు వాదనలను వినిపించారు. నిజానికి వికారాబాద్‌, కొడంగల్‌ కోర్టుల్లో బెయిల్‌ పిటిషన్లు దాఖలవ్వగా.. వాటిని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. మంగళవారంతో వాదనలు పూర్తవ్వగా.. న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. మరోవైపు.. లగచర్ల ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆరుగురికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతికి శుభారంభం..

సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఏపీలో వర్షాలపై కీలక అప్‌డేట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 20 , 2024 | 07:37 AM