Road Accidents.. తెలంగాణ: వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి..
ABN , Publish Date - Jun 25 , 2024 | 08:09 AM
సంగారెడ్డి: తెలంగాణలోని వేర్వేరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంగారెడ్డి: తెలంగాణ (Telangana)లోని వేర్వేరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) అక్కడిక్కడే ముగ్గురు మృతి (Three died) చెందగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా, పటాన్‌చేరు ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ముత్తంగి జంక్షన్ వద్ద ఆగి వున్న మిని పెట్రోల్ ట్యాంకర్‌ను డీసీఎం వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో డీసీఎం వాహనం క్యాబిన్లో ఉన్న ఇద్దరు కూలీలు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు డీసీఎం క్యాబిన్లో ఇరుక్కు పోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం, క్యాసంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ప్రవేట్ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ బస్సు అదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News