Crime News: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమికే ఎసరు.. ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి..
ABN , Publish Date - Jul 10 , 2024 | 04:27 PM
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy), ఆయన కుటుంబానికి చెందిన భూమిని నకిలీ పత్రాలతో కొట్టేందుకు కేటుగాళ్లు యత్నించారు. దీనికి సంబంధించిన కేసును జోగిపేట పోలీసులు(Jogipet Police) ఛేదించారు. భూమిని కాజేందుకు కుట్రలు పన్నిన నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
సంగారెడ్డి: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy), ఆయన కుటుంబానికి చెందిన భూమిని నకిలీ పత్రాలతో కొట్టేందుకు కేటుగాళ్లు యత్నించారు. దీనికి సంబంధించిన కేసును జోగిపేట పోలీసులు(Jogipet Police) ఛేదించారు. భూమిని కాజేందుకు కుట్రలు పన్నిన నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
కేసు వివరాలు ఇవి..
సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామంలో రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబీకుల పేరిట 57ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన సంజీవరెడ్డి, సుధాకర్, రవీందర్ అనే వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించారు. అనంతరం హైదరాబాద్‍కు చెందిన బిల్డర్‌కు రూ.22.30 కోట్లకు అమ్మేశారు. నారాయణఖేడ్‌కు చెందిన మధ్యవర్తి సంజీవరెడ్డికి హైదరాబాద్ బిల్డర్ రూ.11లక్షలు టోకెన్ అమౌంట్ కింద చెల్లించాడు. అయితే ల్యాండ్ ఫోర్జరీ గురించి తెలుసుకున్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి వెంటనే జిల్లా ఎస్పీ రుపేష్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన జోగిపేట పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.