Siddipet Dist: వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు
ABN , Publish Date - Feb 14 , 2024 | 07:33 AM
సిద్దిపేట జిల్లా: వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా: వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు కావడంతో దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. దీంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కాగా సరస్వతి అమ్మవారికి వసంత పంచమి చాలా ప్రీతికరమైన రోజు. అక్షరాభ్యాసానికి యోగ్యకరమైనరోజు.. అందుచేత చాలా మంది తమ పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే ఇంటిలో కూడా అక్షరాభ్యాసం చేయించవచ్చునని వేద పండితులు చెబుతున్నారు.
అలాగే తెలంగాణలో నిర్మిల్ జిల్లాలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేడు సరస్వతీ దేవి జన్మించిన వసంత పంచమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాగా, వసంత పంచమి పర్వదినం సందర్భంగా విద్యా ప్రధాయిని సరస్వతి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేకువజామున సరస్వతి, మహా కాళీ, లక్ష్మీ అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, గణపతి పూజ, సుప్రభాత సేవ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.