Home » Vasant panchami
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపిస్తున్నారు. పూజల కోసం భక్తులు క్యూలైన్లలో 3 గంటల నుంచి 5 గంటల సేపు వేచి చూడాల్సి వస్తోంది.
సిద్దిపేట జిల్లా: వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.
ఈ పండుగ పర్వదినాన ప్రతి ఒక్క పాఠశాల, కళాశాలలో అలాగే బాసర సరస్వతీ దేవి ఆలయంలోనూ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి.
ఈ నెల 26న వసంత పంచమి (Vasant Panchami) సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.