Share News

Vikarabad: బూరుగుపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:10 AM

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో ప్రజలు దురదతో ఇబ్బంది పడుతున్నారని ‘ఇదెక్కడి దురదరా బాబు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు.

Vikarabad: బూరుగుపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు

మోమిన్‌పేట్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో ప్రజలు దురదతో ఇబ్బంది పడుతున్నారని ‘ఇదెక్కడి దురదరా బాబు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు. డాక్టర్‌ శాలిమ, ఏఎన్‌ఎం, ఆశార్కర్లు రెండు రోజులుగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి దురదతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించి మందులను అందజేశారు.


సోమవారం పంచాయతీ ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేసి అవసరమైన మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శాలిమా మాట్లాడుతూ.. వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలని, వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దాదాపు 200 మందికి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించారు.

Updated Date - Dec 17 , 2024 | 05:10 AM