Vikarabad: ‘దురద’పై బూరుగుపల్లిలో ఇంటింటి సర్వే
ABN , Publish Date - Dec 16 , 2024 | 03:48 AM
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజల దురద సమస్య పరిష్కారానికి యంత్రాంగం కదిలింది.
నేడు ప్రత్యేక వైద్య శిబిరం
మోమిన్‌పేట్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజల దురద సమస్య పరిష్కారానికి యంత్రాంగం కదిలింది. బూరుగుపల్లి ప్రజలు నెల రోజులుగా దురద సమస్యతో బాధపడుతున్నారు. ఈ దురదలకు కారణం కూడా తెలియడం లేదు. ఈ సమస్యపై ‘ఇదెక్కడి దురదరా బాబు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన కథనం వైద్యాధికారుల్లో కదలిక తెచ్చింది. దీంతో ఏఎన్‌ఎం సల్మాన్ బేగం, ఆశా వర్కర్ అంజమ్మ ఆదివారం గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి బాధితుల వివరాలు సేకరించారు. ఇక, వైద్యాధికారులు సోమవారం ఆ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.