Share News

Telangana: తప్పంతా గత ప్రభుత్వానిదే.. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ కామెంట్స్..

ABN , Publish Date - Feb 29 , 2024 | 08:47 PM

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు అంశంగా పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. బ్యారేజీలు కుంగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపింస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది.

Telangana: తప్పంతా గత ప్రభుత్వానిదే.. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ కామెంట్స్..

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు అంశంగా పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. బ్యారేజీలు కుంగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపింస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పర్యటించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని కేసీఆర్ జలగ లాగా పీల్చారని ఫైర్ అయ్యారు. ధరణి ని అడ్డు పెట్టుకుని వేలాది కోట్ల రూపాయల విలువైన భూములు దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది కేసీఆరే అన్న ఆయన.. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను ఒప్పుకోవడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.

ప్రజల దీవేనలతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో నిలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఎన్నికల సభలో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించాం. వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేశాం. గత ప్రభుత్వం చేసిన అప్పులను , తప్పులను ఒప్పుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు డిజైన్ చేసింది కేసీఆర్. ఆయన్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్తానంటే కేసీఆర్ రావడం లేదు.

- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ మంత్రి


ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య ను నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీ తో గెలిపించారన్న మంత్రి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 08:48 PM