Share News

Sridhar Babu: ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహిస్తాం

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:40 AM

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Sridhar Babu: ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహిస్తాం

  • ఎలక్ట్రిక్‌ ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తక్కువ విద్యుత్‌ను వాడుకునే ఉత్పత్తుల తయారీ పెరగాలని, కంపెనీలు ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్‌ ట్రేడర్స్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్‌ ఎక్స్‌పోను మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమలకు అనేక రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పరిశ్రమలు ఏటా 14.5శాతం వృద్ధి సాధిస్తుండడంతో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగుతున్నాయన్నారు. ఎలక్ట్రిక్‌ పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో గ్లోబల్‌ ఏఐ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఎక్స్‌పోలో విద్యుత్‌ లైట్లు, స్విచ్‌ బోర్డులు, విద్యుత్‌ వైర్లు, ఎర్తింగ్‌ పరికరాల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Updated Date - Aug 30 , 2024 | 03:40 AM