Share News

Hyderabad: అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థిని అదృశ్యం

ABN , Publish Date - Jun 04 , 2024 | 02:38 AM

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన మరో విద్యార్థిని అదృశ్యమైంది. కాలిఫోర్నియాలో రాష్ట్రంలో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన కందుల నితీష (23) వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు అక్కడి పోలీసులు ‘ఎక్స్‌’ వేదికగా స్థానికుల సాయం కోరారు.

Hyderabad: అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థిని అదృశ్యం

  • వారం రోజులుగా తెలియని ఆచూకీ

  • గత నెలలో మరో తెలంగాణ విద్యార్థి కూడా

  • అంతకుముందు హైదరాబాద్‌ వాసి మృతి

  • వరుస సంఘటనలతో కలకలం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన మరో విద్యార్థిని అదృశ్యమైంది. కాలిఫోర్నియాలో రాష్ట్రంలో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన కందుల నితీష (23) వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు అక్కడి పోలీసులు ‘ఎక్స్‌’ వేదికగా స్థానికుల సాయం కోరారు. పోలీసుల కథనం ప్రకారం.. కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ, శాన్‌ బెర్నార్డినో (సీఎ్‌సయూఎ్‌సబీ) విద్యార్థిని నితీష గత నెల 28వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఆమె చివరిసారిగా లాస్‌ఏంజెల్స్‌లో కనిపించింది. ఆమె అదృశ్యమైనట్టు 30న ఫిర్యాదు అందింది. కాలిఫోర్నియా నంబర్‌ ప్లేట్‌ ఉన్న టొయోటా కరోలా కారులో ఆమె స్వయంగా నడుపుతూ వెళ్లినట్టు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.


ఆమె గురించి సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు. కాగా, అమెరికాలో ఇటీవల ఈ తరహా వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలోనే తెలంగాణకు చెందిన విద్యార్థి రూపేశ్‌ చంద్ర చింతకింది (26) షికాగోలో అదృశ్యమయ్యాడు. అంతకుముందు మార్చిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అరాఫత్‌ కనిపించకుండాపోయాడు. అనంతరం క్లీవ్‌లాండ్‌లో అతడి మృతదేహాన్ని గుర్తించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఐటీ నిపుణులు కూడా ప్రమాదాల్లో చిక్కుకున్న సంఘటనలు ఉన్నాయి.

Updated Date - Jun 04 , 2024 | 02:38 AM