Share News

MLC: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ కేటాయింపు..

ABN , Publish Date - Oct 01 , 2024 | 12:15 PM

శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్ కేటాయించింది. ఈనెల 4న విప్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పైలెట్‌, ఎస్కార్ట్‌ వాహనాలను కేటాయించారు.

MLC: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ కేటాయింపు..

- ఈనెల 4న శాసనమండలి విప్‌గా బాధ్యతలు!

తాండూరు(వికారాబాద్): పార్లమెంటు ఎన్నికలకు ముందుగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి(MLC Patnam Mahender Reddy)కి శాసనమండలి చీఫ్‌ విప్‌గా బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి మహేందర్‌రెడ్డి విప్‌గా బాధ్యతలు చేపట్టలేదు. అయితే బుధవారం పితృపక్షం అమావాస్య ముగియనుండడంతో ఈనెల 4న విప్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, శాసన మండలి స్పీకర్‌కు సమాచారం ఇవ్వడంతో మహేందర్‌ రెడ్డికి పైలెట్‌, ఎస్కార్ట్‌ వాహనాలను కేటాయించారు.

ఇదికూడా చదవండి: Sarpanch Elections: సర్పంచ్‌గా పోటీ చేసే ఆశావాహులకు శుభవార్త


వీటితో పాటు 8మంది ఎస్కార్ట్‌ సిబ్బందిని కూడా కేటాయించారు. కేటాయించిన వాహనాలు పాతవిగా ఉండడంతో వాటి స్థానంలో కొత్త వాటిని కేటాయించాలని ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి లేఖను కూడా పంపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేందర్‌రెడ్డిని ప్రోటోకాల్‌ పరిధిలోకి తీసుకు వచ్చి రంగారెడ్డి లేదా వికారాబాద్‌(Vikarabad) జిల్లా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రోజు మహేందర్‌రెడ్డికి మేడ్చల్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి అక్కడ జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం కల్పించింది.


.........................................................

ఈ వార్తను కూడా చదవండి:

.........................................................

MLA: అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..

- మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే కాలేరు భరోసా

హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదలు ఎవరూ తమ ఇళ్లు కోల్పోతారని అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌(Amberpet MLA Kaleru Venkatesh) భరోసా కల్పించారు. మంగళవారం గోల్నాక డివిజన్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారని, ప్రజలు వారికి తమ బాధలు చెప్పాలని సూచించారు. సోమవారం గోల్నాక డివిజన్‌లోని అంబేడ్కర్‌నగర్‌, న్యూకమలానగర్‌ మూసీ పరివాహక ప్రాంతాలలో ఆయన పర్యటించారు. తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

city4.jpg


తమ ఇళ్లను కూలుస్తామని చెబుతున్నారని, దీంతో ఆందోళన చెందుతున్నామని చెప్పారు. హైడ్రా అధికారులు ఎప్పుడు వస్తారో అనే భయంతో నిద్రలేకుండా గడుపుతున్నామని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసి పైసాపైసా కూడబెట్టి, అప్ప చేసి స్థలాలను కొని ఇళ్లు కట్టుకుంటే.. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో కూల్చివేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నించారు. తమ ఇళ్లను కూలిస్తే సహించేది లేదని, అధికారులను ఎదిరిస్తామని తేల్చిచెప్పారు.


బీఆర్‌ఎస్‌ పేదల పక్షాన పోరాడుతుంది..

బీఆర్‌ఎస్‌ పేదల పక్షాన పోరాడుతుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే కాలేరు వారికి సూచించారు. అన్ని ప్రాంతాలలో పార్టీ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు పర్యటించి వారికి బాధితులకు అండగా ఉంటారన్నారు. అందులో భాగంగా మంగళవారం కేటీఆర్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు డివిజన్‌లోని మూసీ పరివాహక ప్రాంతాలైన తులసీరాంనగర్‌(లంక), కమలానగర్‌, అంబేడ్కర్‌నగర్‌ తదితర బస్తీలలో పర్యటిస్తారని చెప్పారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కేటీఆర్‌కు బాధలు విన్నవించుకోవాలని సూచించారు.


ఇదికూడా చదవండి: హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ఇదికూడా చదవండి: ఎమ్మెస్సీ నర్సింగ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహించాలి

ఇదికూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్... కారణమిదే

ఇదికూడా చదవండి: ఉపఎన్నికపై కడియం శ్రీహరి సంచలన కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2024 | 12:15 PM