Minority welfare: ప్రధాని మోదీని మించిన సీఎం రేవంత్
ABN , Publish Date - Jul 25 , 2024 | 06:29 PM
మైనార్టీల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, జులై 25: మైనార్టీల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
PM Modi: అమిత్ షాతో అజిత్ భేటీ.. కొద్ది గంటలకే.. బీజేపీలో కీలక పరిణామం
మైనార్టీల సంక్షేమం కోసం..
గురువారం హైదరాబాద్‌లో మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నిలబెట్టుకున్నందుకు వీరిద్దరకు ఆయన అభినందనలు తెలిపారు. దీన్ని బట్టి మైనార్టీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పని చేస్తుందనే విషయం అర్థమవుతోందన్నారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.3003 కోట్లు కేటాయిస్తే.. దేశావ్యాప్తంగా మైనార్టీల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం రూ.3,182 కోట్లు మాత్రమే కేటాయించిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.
Also Read: AP Assembly: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఆ మూడు రాష్ట్రాలు..
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణలు మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ మొత్తం.. కేంద్ర ప్రభుత్వ కేటాయించిన నిధుల కంటే మూడు రెట్లు అధికమని ఖురేషి పేర్కొన్నారు. ఇక కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన బడ్జెట్ అంచనాలు కొన్ని పథకాలు, కార్యక్రమాల విషయంలో స్వల్ప పెరుగుదల తప్పా దాదాపుగా మారలేదన్నారు. అయితే కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖకు గత బడ్జెట్ కేటాయింపు రూ. 3097.60 కోట్లు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 3183.24 కోట్లుకు పెంచ బడ్డాయని ఖురేషి సోదాహరణగా వివరించారు.
Also Read: Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!
బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి..
తెలంగాణ అసెంబ్లీలో గురువారం రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. తెలంగాణలో పూర్తి స్థాయి బడ్జెట్ రూ.2,91,191 కోట్లుగా ఉంది. ఈ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం తదితర వివరాలను ఆయన వివరించారు. అలాగే బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత, ఎన్ని నిధులు కేటాయించింది తెలిపారు.
Also Read: Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కోర్టు కీలక ఆదేశాలు.. కదిలిన మోదీ సర్కార్
అదే విధంగా ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారనే వివరాలను తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విపులీకరించారు. అందులోభాగంగా తెలంగాణలో మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.3000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల.. మహమ్మద్ ఖురేషీ పైవిధంగా స్పందించారు.
Read Latest AP News and Telugu News