MP Kiran: ఆ అంశాలపై పార్లమెంట్‌లో గళమెత్తుతాం: ఎంపీ కిరణ్ కుమార్
ABN , Publish Date - Jul 16 , 2024 | 07:26 PM
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖలకు చెందిన 31అంశాలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడారని ఎంపీ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఇప్పటివరకూ సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతామని ఆయన చెప్పుకొచ్చారు.
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖలకు చెందిన 31అంశాలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడారని ఎంపీ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఇప్పటివరకూ సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతామని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు కూడా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.
Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ.. ఎవరికంటే?
ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సమస్య చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. విభజన హామీల్లో మొదటగా ఇచ్చిన హామీ ఇది. తెలంగాణకు సైనిక్ స్కూల్ కేటాయించాలి. వరంగల్, కరీంనగర్‍లను స్మార్ట్ సిటీలుగా చేస్తామని కేంద్రం ప్రకటించింది, కానీ ఆ విషయాన్ని కన్ఫార్మ్ చేయడం లేదు. వెనకబడిన జిల్లాలకు స్పెషల్ అలవెన్స్ కింద రూ.450కోట్లు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆ నిధులను తెలంగాణకు ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అంశాన్ని కూడా పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తోంది. దాన్ని అడ్డుకుంటాం. హైదరాబాద్‌లో ITIR ఏర్పాటు చేయాలి. దీని కోసం 49వేల ఎకరాల భూమి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి చెప్పింది. భువనగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, రాష్ట్రంలో IIMఏర్పాటు చేయాలి. గత ఆరు నెలలుగా తెలంగాణలో స్వేచ్ఛ పాలన సాగుతోంది. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం" అని అన్నారు.
CM Revanth Reddy: అటవీ సంపదపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
TG News: విద్యార్థిని మృతిపై దిగ్భ్రాంతి..
రుణమాఫీపై విపక్షాలు విమర్శలు చేస్తున్నారని, నిజమైన రైతుకి మాత్రమే మాఫీ అందించేందుకు కొన్ని షరతులు పెట్టినట్లు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నాగా మారుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్లు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వారంతటికి వారే వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలను బెదిరించి పార్టీలో చేర్చుకున్నట్లు గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించాలి. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పూర్తిగా సహకరించిందని ఎంపీ కిరణ్ కుమార్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
Kodanda Reddy: బీఆర్ఎస్ పాఠాలు నేర్పాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత కోదండరెడ్డి
Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్