KCR: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన నేడు..
ABN , Publish Date - Mar 31 , 2024 | 06:44 AM
నల్గొండ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా జనగామకు వెళతారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిన పొలాలను పరిశీలిస్తారు.
నల్గొండ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) ఆదివారం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లా (Nalgonda Dist.)లో పర్యటించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvangiri) జిల్లా మీదుగా జనగామకు వెళతారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. తర్వాత అర్వపల్లి, సూర్యాపేట మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సూర్యాపేటలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు సూర్యాపేట పార్టీ ఆఫీస్‌లో కేసీఆర్ ప్రెస్ మిట్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలించి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరతారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నీరు అందక ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా కరువు కాటకాలతో పంటలు ఎండిపోతున్న విషయం తెలిసిందే. భూగర్భ జలాలు అడగండిపోవడంతో బోర్లు ఎండిపోయాయి. దీంతో పంట పొలాలు నిలువునా ఎండుతున్నాయి. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు నల్లగొండ మండలం ముషంపల్లిలో కేసీఆర్ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీ నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.