Share News

Komatireddy Venkat Reddy: కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలి

ABN , Publish Date - Feb 11 , 2024 | 01:58 PM

నల్గొండ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నేడు నల్గొండలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందన్నారు.

Komatireddy Venkat Reddy: కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలి

నల్గొండ: నల్గొండ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నేడు నల్గొండలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందన్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలన్నారు. ఎస్ఎల్‌బీసీని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడన్నారు. సభ రోజు నల్గొండలో ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలని కోమటిరెడ్డి అన్నారు.

కేసీఆర్ మాట తప్పడంపై నల్గొండ టౌన్‌లో సభ రోజు వినూత్న నిరసన చేస్తామని తెలిపారు. కేసీఆర్ కోసం చైర్, పింక్ టవల్ ఎల్ఈడి స్క్రిన్ పోలీసు పర్మిషన్‌తో పెడతామని కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజాపయోగ్యమైందన్నారు. కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించామన్నారు. కాళేశ్వరం మేడిగడ్డపై చర్చ వేదికలో అందరూ పాల్గొనాలని కోమటిరెడ్డి తెలిపారు.

Updated Date - Feb 11 , 2024 | 01:58 PM