Telangana: డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం.. నివాళులర్పించిన సీఎం రేవంత్..
ABN , Publish Date - Jun 30 , 2024 | 01:23 PM
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నిజామాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నిజామాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రగతినగర్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ఇప్పటికే ప్రారంభమైంది. అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
రేవంత్ నివాళి..
ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నిజామాబాద్ లోని డీఎస్ నివాసానికి చేరుకుని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం రేవంత్ తోపాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీఎస్ కు నివాళులర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీఎస్ క్రమశిక్షణ కలిగిన నాయకుడన్నారు. కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ చీఫ్ వరకు ఎదిగారని.. తెలంగాణ ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు.
నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..
ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
Read Latest Telangana News and Latest Telugu News