Share News

Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..

ABN , Publish Date - Sep 10 , 2024 | 01:33 PM

సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా వరకు వచ్చిన జీతంలో కొంత సేవింగ్ చేసి.. ఇల్లు కొంటారు. ఇంకొందరు ప్రభుత్వ సహకారంతో పాటుగా తమ కష్టాన్ని కలుపుకొని ఇంటిని నిర్మించుకుంటారు. అయితే.. అక్కడక్కడ పేదల పరిస్థితి దయనీయంగానే ఉంది.

Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..
Old Lady Living in Bathroom

వికారాబాద్, సెప్టెంబర్ 10: సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా వరకు వచ్చిన జీతంలో కొంత సేవింగ్ చేసి.. ఇల్లు కొంటారు. ఇంకొందరు ప్రభుత్వ సహకారంతో పాటుగా తమ కష్టాన్ని కలుపుకొని ఇంటిని నిర్మించుకుంటారు. అయితే.. అక్కడక్కడ పేదల పరిస్థితి దయనీయంగానే ఉంది. ఇల్లు లేని వారు ఇంకా ఉన్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని ఓ వృద్ధురాలి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆమె గత కొన్నేళ్లుగా ఇల్లు లేక.. మరుగుదొడ్డిలో నివసిస్తోంది. అక్కడే తింటూ.. అక్కడే పడుకుంటూ దయనీయ పరిస్థితుల్లో బతుకుతోంది.


పరిగి మండలం చిగురాల్‌పల్లిలో ఎరోళ్ళ మల్లమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమెకు ఉండేందుకు ఇల్లు లేక స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మంజూరైన మరుగుదొడ్డిలో నివాసం ఉంటోంది. 20 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా నానా కష్టాలు పడి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. శిథిలావస్థలో ఉన్న ఈమె చిన్న ఇల్లు భారీ వర్షాలకు 15 ఏళ్ల క్రితమే కూలిపోయింది. ఆ తర్వాత చిన్న గుడిసెలో నివాసం ఉంది. కాల క్రమేణా అది కూలడంతో మరుగుదొడ్డినే ఇల్లుగా మార్చుకుంది మల్లమ్మ. దురదృష్టవశాత్తు అనుకోకుండా మల్లమ్మ కూతురు భర్త చనిపోయాడు. దాంతో కూతురు, ముగ్గురు పిల్లలతో కలిసి మల్లమ్మ అదే బాత్రూంలో ఉంది. కొద్దిరోజుల తర్వాత బతుకు జీవనం భారంగా మారి.. మల్లమ్మ కూతురు పొట్టకూటి కోసం పిల్లలతో పాటు హైదరాబాద్ వలస వెళ్లింది. కానీ.. 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటోంది. మల్లమ్మ వైపు ఏ ప్రభుత్వం, ఏ ప్రజాప్రతినిధి కన్నెత్తి చూడలేదు. ఇప్పుడామె ఉంటోన్న మరుగుదొడ్డి కూడా శిథిలావస్థకు చేరింది. దాంతో ప్రభుత్వం స్పందించి తన బాధను తీర్చి.. ఇల్లు మంజూరు చేయాలని మల్లమ్మ కోరుతోంది.


మల్లమ్మకు ఇల్లు ఇప్పించాలని ప్రయత్నం చేశామని గ్రామ మాజీ సర్పంచ్ వెంకటయ్య అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ద్వారా గతంలో చేసిన ప్రయత్నాలు ముగిశాయన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కూడా మల్లమ్మ గాధను తెలిపే ప్రయత్నం చేస్తున్నామని వెంకటయ్య చెప్పారు.


Also Read:

ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..

తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా

సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలక మార్పులు?

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 10 , 2024 | 01:34 PM