Share News

Nalgonda: కూరెళ్ల శిష్యుడిని కావడం నా అదృష్టం

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:06 AM

పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్యకు శిష్యుడినికావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌ అన్నారు.

Nalgonda: కూరెళ్ల శిష్యుడిని కావడం నా అదృష్టం

  • హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌

రామగిరి(నల్లగొండ), సెప్టెంబరు 8: పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్యకు శిష్యుడినికావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌ అన్నారు. తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన విఠలాచార్య 2.15 లక్షల పుస్తకాలను సేకరించారని తెలిపారు. నల్లగొండలో కూరెళ ్లవిఠలాచార్యకు ఆదివారం పౌరసన్మానం జరిగింది. ఈ


కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ.. కూరెళ్ల 1954లోనే గ్రంథాలయం ఏర్పాటుచేసి దానికి శంభులింగేశ్వర అని నామకరణం చేశారని గుర్తు చేశారు. తెలుగు భాష, సాహిత్యం అమ్మలాంటివని చెప్పారు. విఠలాచార్య మాట్లాడుతూ తన సన్మాన కార్యక్రమానికి తన శిష్యుడే ముఖ్య అతిథిగా రావడం మరపురాని అనుభూతి అన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 03:06 AM