Share News

TG Nrews: వారిని వదిలి పెట్టం... పల్లా రాజేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:48 PM

బీఆర్ఎస్(BRS) నుంచి వేరే పార్టీలోకి వెళ్లేవారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి*(Palla Rajeshwar Reddy) హెచ్చరించారు. పార్టీ మారే నేతలు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని చెప్పారు. పార్టీ మారిన నేతలని ప్రజలు చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)కి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు లేక తమ పార్టీ నేతల వెంట పడుతున్నారని మండిపడ్డారు. కొందరు పిరికి పందలు పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు.

TG Nrews: వారిని వదిలి పెట్టం... పల్లా రాజేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) నుంచి వేరే పార్టీలోకి వెళ్లేవారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy) హెచ్చరించారు. పార్టీ మారే నేతలు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని చెప్పారు. పార్టీ మారిన నేతలని ప్రజలు చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)కి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు లేక తమ పార్టీ నేతల వెంట పడుతున్నారని మండిపడ్డారు. కొందరు పిరికి పందలు పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు. స్వలాభం కోసం రాజకీయాలను భ్రష్టు పట్టించిన నేతలు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం శోచనీయమని అన్నారు. అక్రమాలు చేసిన వారు పార్టీ మారితే వారి అక్రమాలను బీఆర్ఎస్సే బయట పెడుతుందని హెచ్చరించారు.

Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే శుభకార్యం అంటూ..

రైతు బంధు నిధులు ఏమయ్యాయి..?

అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు భరోసా కల్పించకుండా గత కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. గత ప్రభుత్వంలో అంచనాలు వేసి వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో రైతు బంధు నిధులను త్వరగా రైతుల ఖాతాల్లో వేశామని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు డబ్బులు ఇవ్వలేదని అన్నారు. తాము రైతు బంధు కోసం సిద్ధంగా ఉంచిన నిధులు ఏ కాంట్రాక్టర్‌కు ఇచ్చారో తెలుసునని చెప్పారు. 9 నెలల్లో తాము భక్త రామదాసు ప్రాజెక్ట్ కట్టింది వాస్తవమా కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ, వరికి రూ. 500 బోనస్ ఇవ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

TS Highcourt: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 03:48 PM