Share News

TG Politics: రేపు గాంధీ భవ‌న్‌లో కీలక సమావేశం

ABN , Publish Date - Nov 20 , 2024 | 08:54 PM

రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరి.. మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కావోస్తుంది. ఈ నేపథ్యంలో సంబురాలు నిర్వహించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం గాంధీ భవన్‌లో పార్టీ అగ్రనేతలు భేటీ కానున్నారు.

TG Politics: రేపు గాంధీ భవ‌న్‌లో కీలక సమావేశం
TG PCC Chief Mahesh Kumar Goud

హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటరు పట్టం కట్టి మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సంబురాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంది. అందులోభాగంగా గురువారం సాయంత్రం 3.00 గంటలకు గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది.

Also Read: పింక్ బుక్‌లో వారి పేర్లు.. అదికారంలోకి వచ్చాకా..


పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తుంది. ఆ క్రమంలో రేవంత్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుంది. దీంతో సంబరాలు చేయాలని నిర్ణయించారు. అలాగే డిసెంబర్ 4 , లేదా 5వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్నారు.

Also Read: మావోయిస్టు అగ్రనేత కీలక నిర్ణయం.. రంగంలోకి పోలీసులు


అందుకు ప్రదేశాన్ని సైతం ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇక ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా ప్రచారం చేయడంపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్బంగా సూచించారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలోనే అంశంపై పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పీసీసీ చీఫ్, సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

Also Read: New Bike in Market: ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే.. 140 కిలోమీటర్లు దూసుకు పోతుంది..


ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు దీపా దాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలు హాజరుకానున్నారు. పీపీసీ చీఫ్‌గా ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి కార్యవర్గం సమావేశం ఇది.

Also Read: Exit Polls: ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. రెండు రాష్ట్రాల్లో ఎన్డీయేదే హవా


మరోవైపు మంగళవారం వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవ వేడుక పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభా వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.

Also Read: తేగలు తింటే ఇన్ని లాభాలున్నాయా..?


దీంతో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అలాంటి వేళ.. ప్రతిపక్షాల మాటల దాడిని ఎదుర్కొనేందుకు అంతా సిద్దంగా ఉండాలని పార్టీ నేతలకు పీసీసీ చీఫ్, సీఎం సూచించనున్నారు. ఇంకోవైపు కుల గణన సర్వే దాదాపు 60 శాతంపైగా జరిగింది.


ఈ సర్వే పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో సైతం అన్ని పదవులను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అందుకోసం ముందస్తు ప్రణాళికలను సైతం ప్రభుత్వం ఇప్పటికే సిద్దం చేసే పనిలో నిమగ్నమైంది. అలాంటి వేళ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. ప్రజల మధ్యకు వెళ్లి సంబురాలు చేసుకునే విధంగా పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాన్ని రచిస్తుంది.

For Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 08:57 PM