PM Modi: రేపు జగిత్యాలలో ప్రధాని మోదీ పర్యటన
ABN , Publish Date - Mar 17 , 2024 | 07:00 PM
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దృష్టి సారించారు. లోక్‌సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (ఆదివారం) ఏపీలో ప్రజాగళం భారీ బహిరంగా సభ తర్వాత హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దృష్టి సారించారు. లోక్‌సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (ఆదివారం) ఏపీలో ప్రజాగళం భారీ బహిరంగా సభ తర్వాత హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు. రాత్రి 7.50 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి మోదీ వస్తారు. రాత్రి 8 గంటలకు రాజ్ భవన్‌కు మోదీ చేరుకుంటారు. రాత్రి రాజ్ భవన్‌లోనే బస చేయనున్నారు.
రేపు(సోమవారం) ఉదయం 10.10గంటలకు జగిత్యాలకు ప్రధానమంత్రి మోదీ వెళ్తారు. 11.15గంటలకు జగిత్యాలలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 11.30 నుంచి 12.20 వరకు జగిత్యాల సభలో మోదీ ప్రసంగిస్తారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ సభను ప్లాన్ చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోమాసే శ్రీనివాస్ అభ్యర్థులను మోదీ ఆశీర్వాదిస్తారు. గీతా విద్యాలయం గ్రౌండ్స్‌లో ఈ సభ జరగనున్నది. సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. మూడు నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణను చేసినట్లు తెలుస్తోంది. ఈ సభ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ తిరుగు పయనమవుతారు. బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటక పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి