Share News

Ponguleti Srinivas Reddy: త్వరలోనే కొత్త రేషన్‌, ఆరోగ్య శ్రీ కార్డులు

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:20 AM

గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.7.19లక్షల కోట్ల అప్పులున్నాయని, తమ ప్రభుత్వం అసలు, వడ్డీ కింద ప్రతి నెలా సుమారు రూ.6వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తోందని రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనిసవారెడ్డి చెప్పారు.

Ponguleti Srinivas Reddy: త్వరలోనే కొత్త రేషన్‌, ఆరోగ్య శ్రీ కార్డులు

  • 15తో రుణమాఫీ పూర్తి చేస్తాం

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • సీతారామ పనుల పరిశీలన

సత్తుపల్లి, ఆగస్టు8: గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.7.19లక్షల కోట్ల అప్పులున్నాయని, తమ ప్రభుత్వం అసలు, వడ్డీ కింద ప్రతి నెలా సుమారు రూ.6వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తోందని రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనిసవారెడ్డి చెప్పారు. రూ.31వేల కోట్ల రుణ మాఫీ చేసే స్థితిలో రాష్ట్రం లేకపోయినా రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఆగస్టు 15తో రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద జరుగుతున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పొంగులేటి గురువారం పరిశీలించారు.


ప్రాజెక్టులోని సొరంగంలోకి వెళ్లి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీతారామా ప్రాజెక్టు రీడిజైన్‌ పేరిట గత ప్రభుత్వం పెద్ద ఎత్తును ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. తాము నిధులను పొదుపు చేస్తూ ప్రాజెక్టు పనులను వీలైనతం త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. వందల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వం ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని, అన్నీ అనుకూలిస్తే 15వ తేదీనే సీఎం చేతులమీదుగా తాము ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. అర్హులందరికీ త్వరలో రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామన్నారు. అలాగే, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నెలాఖరులో ప్రారంభిస్తామని చెప్పారు.

Updated Date - Aug 09 , 2024 | 04:20 AM