Share News

Ponnam Prabhakar: విదేశీ విద్యానిధి మరింత మందికి అందిస్తాం

ABN , Publish Date - Aug 12 , 2024 | 04:56 AM

బీసీ సంక్షేమశాఖలో అమలు చేస్తున్న మహాత్మ జ్యోతిబా ఫూలేవిదేశీ విద్యానిధి (బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌) పథకాన్ని మరింత మందికి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

Ponnam Prabhakar: విదేశీ విద్యానిధి మరింత మందికి అందిస్తాం

  • మంత్రి పొన్నం వెల్లడి.. ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమశాఖలో అమలు చేస్తున్న మహాత్మ జ్యోతిబా ఫూలేవిదేశీ విద్యానిధి (బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌) పథకాన్ని మరింత మందికి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ఈ ఏడాదికి సంబంధించిన ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ప్రక్రియను మార్చిలోనే పూర్తిచేయాల్సి ఉందని, కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా జాప్యం జరిగిందని చెప్పారు. విదేశీ విద్యానిధి స్కాలర్‌షి్‌పను గతంలో ఏడాదికి 300మందికి అందించేవారని, కానీ తమ ప్రభుత్వం ఆ సంఖ్యను రెండు లేదా మూడింతలు పెంచాలనే ఉద్దేశంతో ఉందని తెలిపారు.


ఇప్పటికే స్కాలర్‌షి్‌పలకు కొంతమంది ఎంపిక జరిగిందని, వారికి సంబంధించిన నిధులన్నింటినీ ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంద న్నారు. గత ఏడాది మొదటి విడత అందుకున్న వారికి రెండో విడతకు సంబంధించి త్వరలోనే నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకంలో లబ్ధిదారుల సంఖ్యను పెంచనుందని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ‘‘మరింత మందికి విదేశీ విద్యానిధి’’ శీర్షికన 2024 మార్చి 28న కథనాన్ని ప్రచురించింది.

Updated Date - Aug 12 , 2024 | 04:56 AM