Share News

Ponnam: మంత్రితో ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల జేఏసీ భేటీ

ABN , Publish Date - Dec 08 , 2024 | 03:59 AM

సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చినట్టు

Ponnam: మంత్రితో ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల జేఏసీ భేటీ

హైదరాబాద్‌, బర్కత్‌పుర, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చినట్టు ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల సంఘాల జేఏసీ కన్వీనర్‌ బి.వెంకటేశం తెలిపారు. ఆటో బంద్‌ను విరమించిన తెలంగాణ ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులు బి.వెంకటేశం(ఏఐటీయూసీ), ఎ.సత్తిరెడ్డి (టీఏడీఎస్‌), ఎంఏ. సలీమ్‌(యూటీఏడీడబ్ల్యూఏ), ఎండి.ఒమర్‌ఖాన్‌, ఎం.కృష్ణ (ఏఐటీయూసీ), వి.మారయ్య, ప్రవీణ్‌(టీయూసీఐ) శనివారం ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి 13 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. తమ న్యాయ సమ్మతమైన డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని వెంకటేశం పేర్కొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 03:59 AM