Janajatara Sabha : ప్రియాంక ప్రచారం.. 2 రోజులు
ABN , Publish Date - May 07 , 2024 | 06:20 AM
తెలంగాణలో ఎన్నికల ప్రచారంపైన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే తుక్కుగూడ, నిర్మల్, ఆలంపూర్ జనజాతర సభల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఈ నెల 9న మరో రెండు సభల్లోనూ
10, 11 తేదీల్లో జనజాతర సభలు, రోడ్‌షోలు
కరీంనగర్‌కు బదులుగా నర్సాపూర్‌లో 9న రాహుల్ సభ
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎన్నికల ప్రచారంపైన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే తుక్కుగూడ, నిర్మల్, ఆలంపూర్ జనజాతర సభల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఈ నెల 9న మరో రెండు సభల్లోనూ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆ రోజున సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్‌లోను, 6 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలోనూ జరిగే జనజాతర సభల్లో పాల్గొననున్నారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం రాహుల్‌గాంధీ ఉదయం 11 గంటలకు కరీంనగర్‌లో, సాయంత్రం 6 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలలో జరిగే జనజాతర సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, రాహుల్ బిజీ షెడ్యూల్ కారణంగా కరీంనగర్‌లో జరగాల్సిన జనజాతర సభ రద్దయింది. దాని స్థానే సాయంత్రం 4గంటలకు నర్సాపూర్, ఆ తర్వాత సరూర్‌నగర్‌లో జరిగే జనజాతర సభకు రాహుల్‌గాంధీ హాజరవుతున్నారు. రాహుల్ వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్నారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఆమె పర్యటన ఒకే రోజు ఉండగా.. ఇప్పుడు రెండు రోజుల పాటు ప్రచారం చేయాలని నిర్ణయించారు. 10న ఉదయం కామారెడ్డి, మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరు జనజాతర సభల్లో, సాయంత్రం 7 గంటలకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మణికొండ కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం 10గంటలకు పటాన్‌చెరులో కార్నర్ మీటింగ్‌లోను, సాయంత్రం 3గంటలకు మక్తల్ జనజాతర సభలోనూ పాల్గొంటారు. మొత్తమ్మీద ప్రియాంకసభతో తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.