Share News

Priyanka Mohan: వేదిక కూలి పడిపోయిన హీరోయిన్‌ ప్రియాంక

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:04 AM

‘సరిపోదా శనివారం’ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదిక కుప్పకూలడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

Priyanka Mohan: వేదిక కూలి పడిపోయిన హీరోయిన్‌ ప్రియాంక

  • తప్పిన పెను ప్రమాదం

  • పాలకుర్తి కాంగ్రెస్‌ నేత ఝాన్సీరెడ్డికి గాయాలు

  • తొర్రూరు షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో ఘటన

తొర్రూరు, అక్టోబరు 3: ‘సరిపోదా శనివారం’ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదిక కుప్పకూలడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే కాంగ్రెస్‌ పార్టీ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కాలు విరిగింది. ఈ ఘటన గురువారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణంలో జరిగింది.


పట్టణంలోని ఓ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించేందుకు హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్‌ నేత ఝాన్సీరెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో వారు షాపింగ్‌ మాల్‌ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. అదేసమయంలో ఒక్కసారిగా జనాలు ముందుకు దూసుకురావడంతో వేదిక కుప్పకూలింది. దీంతో ఝాన్సీరెడ్డి కాలు రెండుచోట్ల విరగడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Oct 04 , 2024 | 04:04 AM