PV Manohar Rao: పీవీని కాంగ్రెస్ అవమానించింది
ABN , Publish Date - Dec 30 , 2024 | 03:48 AM
కాంగ్రెస్‌కు ఎంతో చేసిన పీవీ నర్సింహారావు మరణాంతరం ఆ పార్టీ అవమానించిందని పీవీ సోదరుడు పీవీ మనోహర్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పీవీ సోదరుడు పీవీ మనోహర్‌రావు
భీమదేవరపల్లి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌కు ఎంతో చేసిన పీవీ నర్సింహారావు మరణాంతరం ఆ పార్టీ అవమానించిందని పీవీ సోదరుడు పీవీ మనోహర్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పీవీ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలోకి కూడా అనుమతించలేదని వాపోయారు. ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో ఫోన్‌లో మాట్లాడుతూ తన వేదన తెలిపారు. దేశానికి ప్రధానులుగా చేసిన వారు చనిపోయిన అనంతరం యమున నది పక్కన అంత్యక్రియలు నిర్వహించి, అక్క డే స్మారక ఘాట్‌ను నిర్మించడం ఆనవాయితీ అని చెప్పారు.
పీవీ భౌతిక కాయాన్ని మాత్రం హైదరాబాద్‌కు తరలించారని దాంతో ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొన్నారు. పీవీ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు నిర్మించలేదని, ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.