Share News

R. Krishnaiah: 26వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలి

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:49 AM

వచ్చే డీఎస్సీలో 26వేల ఉపాధ్యాయ పో స్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్‌. కృష్ణయ్య(Former MP R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో గురువారం దిల్‌సుఖ్‌నగర్‌ లో నిర్వహించిన నిరుద్యోగ సభలో ఆయన పాల్గొన్నారు.

R. Krishnaiah: 26వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలి

- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్: వచ్చే డీఎస్సీలో 26వేల ఉపాధ్యాయ పో స్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్‌. కృష్ణయ్య(Former MP R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో గురువారం దిల్‌సుఖ్‌నగర్‌ లో నిర్వహించిన నిరుద్యోగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పాఠశాలకు వెళ్లి చూసినా ఉపాధ్యాయులు లేక ఖా ళీ కుర్చీలు దర్శనమిస్తుండగా, విద్యాశాఖ అధికారు లు మాత్రం టీచర్‌ పోస్టులు తక్కువగా ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తుండడం విడ్డూరంగా ఉం దని మండిపడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: Metro Project: హైదరాబాద్‌ మెట్రోకు ఏడేళ్లు


ఇంగ్లీషు, మ్యాథ్స్‌ టీచర్‌ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయని పలువురు నిరుద్యోగులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. పాఠశాలల్లో పీఈటీ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో స్పోర్ట్స్‌, ఆటలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థుల శారీరకదృఢత్వాన్ని పెంపొందించాలన్నారు. 20 ఏళ్లుగా ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మూలంగా అవి మూసివేసే దిశలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


city1.2.jpg

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే టీచర్‌ పోస్టులను భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, ప్రొఫెసర్‌ మధు, లక్ష్మీనారాయణ, సి.రాజేందర్‌, అనంతయ్య, రవియాదవ్‌, నిఖిల్‌పటేల్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తి

ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2024 | 06:49 AM