R. Krishnaiah: అన్ని పార్టీలూ ఎమ్మెల్సీ టికెట్లు బీసీలకే కేటాయించాలి
ABN , Publish Date - Nov 07 , 2024 | 10:41 AM
రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయితే బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వదో ఆ పార్టీని ఎన్నికల్లో ఓడిస్తామని ఆయన హెచ్చరించారు.
- మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయితే బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వదో ఆ పార్టీని ఎన్నికల్లో ఓడిస్తామని ఆయన హెచ్చరించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ అధ్యక్షుడు భూపేష్సాగర్ సంయుక్త ఆధ్వర్యంలో బీసీ సంఘాల కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ వార్తను కూడా చదవండి: KTR: 20 రోజులుగా రైతన్నల బాధలు: కేటీఆర్
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్(Karimnagar, Adilabad, Nizamabad, Medak), రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయని, ఈ మూడు నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులనే పోటీలో నిలపాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ(Congress, BRS, BJP), ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలను పూర్తిగా విస్మరించాయని, కనీ సం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల లో రిజర్వేషన్ల కల్పన కోసం రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు టి.రాజ్‌కుమార్, వేముల రామకృష్ణ, జి. మల్లే్‌షయాదవ్, జి.అనంతయ్య, మోదీ రాందేవ్, జోషి రాఘవ, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్!
ఈవార్తను కూడా చదవండి: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు
ఈవార్తను కూడా చదవండి: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఈవార్తను కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News and National News