TG Politics: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలను బయటపెట్టిన రఘునందన్ రావు
ABN , Publish Date - Mar 26 , 2024 | 05:36 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao) పలు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ కేసులో రెండో బాధితుడిని తానేనని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్‌ను చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని చెప్పారు.
సంగారెడ్డి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao) పలు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ కేసులో రెండో బాధితుడిని తానేనని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్‌ను చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని చెప్పారు. 2015లో ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పారు. మంగళవారం నాడు సంగారెడ్డిలో రఘునందన్‌రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నేత BL సంతోష్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. BL సంతోష్‌ని అనవసరంగా ఈ కేసులో ఇరికించారని అన్నారు. ఎవరికి నచ్చినట్టు ఈ కేసును ముక్కలు చేయకుండా సమగ్రమైన విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. గతంలో రేవంత్ బిడ్డ పెళ్లికి పేరోల్ మీద ఆయన బయటికి వచ్చారని అన్నారు. సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసు అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత డీజీపీకి అటాచ్ అయిన శ్రీనాథ్‌రెడ్డి ఎవరని నిలదీశారు. డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారని రఘునందన్‌రావు ప్రశ్నించారు.
Big Breaking: కవితకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ..
దుబ్బాక ఉప ఎన్నికలో ఫోన్ ట్యాపింగ్
అమెరికాకు ఇద్దరు వ్యక్తులను ఎవరు పంపారో తెలియాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఎంతకు కొన్నారు తెలియాలని చెప్పారు. సీఎం రేవంత్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఆయనకు నచ్చినట్టు విచారణ జరిపిస్తే ఎలా అని ప్రశ్నించారు. తాను దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. ఓ టీవీ ఛానెల్‌లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇంతకీ దిగజారుతారా అని మండిపడ్డారు. తాను బాధితుడిగా మాట్లాడుతున్నానని అన్నారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయి హరీష్‌రావు, మూడో ముద్దాయిగా అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని.. ఆ తర్వాతే మిగతా పోలీస్ ఆఫీసర్లను ఈ కేసులో విచారించాలని కోరారు.
TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ ఆ పార్టీలో చేరుతారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్
ఆ రోజు ఒకే విమానంలో సీఎం రేవంత్, హరీశ్‌రావు
రేవంత్ ఫోన్‌ని ట్యాపింగ్ చేయమని కేసీఆర్ చెప్పారు.. మరి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి లేదని రఘునందన్‌రావు అన్నారు. ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్. రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా నిజాలు తెలుస్తారా సీఎం రేవంత్ చెప్పాలి. ఎమ్మెల్యేలు పార్టీ మారుతామంటే కేసీఆర్ బెదిరించి ఇలా ప్లాన్ చేశారు. హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే ముగ్గురు విదేశాలకు పారిపోయారు అంటున్నారు.. వీళ్లని కూడా విదేశాలకు పొమ్మంటున్నారా. 2015లో డీజీపీ ఎవరో అతన్ని మొదటగా విచారించాలి. హైకోర్టు జడ్జీలు, సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ చేయాలి. నిన్న మాజీ మంత్రులు ముగ్గురు రహస్యంగా సమావేశం అయ్యారు. కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసి హరీష్ రావుని కాంగ్రెస్‌లోకి పంపించాలనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయానికి సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. ఈనెల19 మార్చి రాత్రి 10.15గంటలకి సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే విమానంలో ఎందుకు ప్రయాణం చేశారు. విమానంలో రెండు గంటలు ఇద్దరు ఏం మాట్లాడారో తెలియాలి. రూ. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను ఒక సంస్థ నుంచి ఎత్తుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వారినందరిని విచారించాలి’’ అని రఘునందన్‌రావు అన్నారు.
ఆ ఆధారాలు పంపిస్తా
సీఎం రేవంత్, డీజీపీ ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని రఘునందన్‌రావు కోరారు. ‘‘నాకు నోటీస్‌లు పంపిస్తే నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తాను. ఈ కేసులో కొందరిని ఇరికించి, మరి కొందరిని కాపాడే కుట్ర జరుగుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య ఏం సంభాషణ జరిగింది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ గురించి చర్చ జరిగిందా..? 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లోకి వస్తాను అన్నావా..? మెదక్ ఎంపీ ఎన్నికల వరకు మా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని చెప్పావా..? అసలేం మాట్లాడారో తెలియాలి. BL సంతోష్ కేసులో ఆడియో, వీడియోలు కేసీఆర్ చూపెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఇవన్నీ కేసీఆర్‌కి ఎలా తెలుస్తాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో ఈ కేసుని విచారణ చేయాలి. సీబీఐపై నమ్మకం ఉంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. అందరూ అధికారులు మళ్లీ రేవంత్ చుట్టే చేరుతున్నారు... ఆయన జాగ్రత్తగా ఉండాలి. హరీష్ రావు శ్రీమతి, కవిత భర్త ఫోన్లని కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేశారు’’ అని రఘునందన్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి
BRS: తెలంగాణ భవన్ వేదికగా బయటపడిన బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు
BRS vs Congress: కేసీఆర్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడేందుకు సిద్ధమైన స్నేహితుడు..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయాలి