Share News

Lok Sabha Elections: కేసీఆర్ నూరు అబద్ధాలు.. రేవంత్ వెయ్యి అబద్ధాలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:15 PM

గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందనరావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని.. అయితే కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఐదు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.

Lok Sabha Elections: కేసీఆర్ నూరు అబద్ధాలు.. రేవంత్ వెయ్యి అబద్ధాలు

సిద్దిపేట, ఏప్రిల్ 29: గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందనరావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని.. అయితే కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఐదు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.

TS SSC Results Updates : రేపే 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మెదక్ పార్లమెంట్ కిసాన్ మోర్చా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రఘునందనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రిగా కేసిఆర్ నూరు అబద్ధాలు ఆడితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు ఆడేందుకు సిద్దంగా ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు.

Teachers' Recruitment Case: దీదీకి జస్ట్ రిలీఫ్


Chicken Shawarma: చికెన్ షావర్మా తిని.. 12 మంది ఆస్పత్రిపాలు

కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎరువుల కోసం చెప్పులు లైన్‌లో పెట్టిన విషయం మరవద్దంటూ ప్రజలకు రఘునందనరావు సూచించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ ఎరువుల కొరత అనేదే లేకుండా చూశారని చెప్పారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేసేందుకు పంపాలని ఈ సందర్బంగా ప్రజలకు రఘునందనరావు మనవి చేశారు.

LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్

ఇక దుబ్బాక నియోజకవర్గం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అవగాహన లేదన్నారు. ఆయనకు డబ్బులు పెట్టి ఓట్లు కొనడం మాత్రమే తెలుసునని చెప్పారు. ఓటర్లను బానిసలుగా చూసే సంస్కారం కొత్త ప్రభాకర్ రెడ్డిదని ఆభివర్ణించారు. ఎంపీ ఎన్నికలు పూర్తికాగానే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఖాయమని స్పష్టం చేశారు.

AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!

Read National News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 06:15 PM