Share News

Rahul Gandhi: ప్రజాపాలన భేష్‌!

ABN , Publish Date - Dec 26 , 2024 | 03:54 AM

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభినందనలు తెలిపారు.

Rahul Gandhi: ప్రజాపాలన భేష్‌!

హామీలన్నీ అమలు చేసే దిశగా సాగుతున్న తెలంగాణ సర్కారు

  • రవాణా, బీసీ సంక్షేమశాఖ కార్యక్రమాలకు ప్రత్యేక అభినందనలు: రాహుల్‌

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు అభినందనీయమన్నారు. అలాగే రవాణా, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.


పార్టీ ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ప్రజాప్రతినిధులందరూ నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాహుల్‌ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో, రాహుల్‌ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళతామంటూ ఇటీవల రాహుల్‌కుపొన్నం లేఖ రాశారు. ఆ లేఖకు స్పందనగా రాహుల్‌ మంత్రికి లేఖ రాసి, అభినందనలు తెలిపారు.

Updated Date - Dec 26 , 2024 | 03:54 AM