Rahul Gandhi: ఉత్తమ్‌కు రాహుల్‌గాంధీ పరామర్శ
ABN , Publish Date - Oct 03 , 2024 | 03:46 AM
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్‌రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు.
మంత్రికి ఫోన్ చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నేత
న్యూఢిల్లీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్‌రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు. పురుషోత్తమ్‌రెడ్డి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు.
ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌కు రాహుల్ ఫోన్ చేసి పరామర్శించారు. పురుషోత్తమ్‌రెడ్డి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ లేఖనూ పంపారు. తండ్రిని కోల్పోయినందుకు మీ బాధను తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు.