Share News

Mahesh Kumar Goudఫ రాహుల్‌ పర్యాటన గంటే..

ABN , Publish Date - Nov 04 , 2024 | 03:25 AM

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా కానీ.. టీపీసీసీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కులగణన సదస్సుకు అగ్రనేత రాహుల్‌ గాంధీ వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ చెప్పారు. ఈ అంశానికి ఆయన అంత ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు.

Mahesh Kumar Goudఫ రాహుల్‌ పర్యాటన గంటే..

  • ఎన్నికల బిజీ షెడ్యూల్‌లోనూ కులగణన సదస్సుకు..: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా కానీ.. టీపీసీసీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కులగణన సదస్సుకు అగ్రనేత రాహుల్‌ గాంధీ వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ చెప్పారు. ఈ అంశానికి ఆయన అంత ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని గాంధీ నాలెడ్జ్‌ సెంటర్లో కులగణనపై సదస్సు జరగనున్న నేపథ్యంలో.. రాహుల్‌ సాయంత్రం 5 గంటలకు రానున్నారని వెల్లడించారు. బిజీ షెడ్యూల్‌ ఉండటంతో ఇక్కడ ఆయన గంటసేపు మాత్రమే ఉంటారన్నారు. ఆదివారం గాంఽధీభవన్‌లో ఆ సదస్సు సన్నాహక సమావేశం జరిగింది. ఏఐసీసీ నేత కొప్పుల రాజు, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కులగణన చేపట్టి ఆయా వర్గాల జనాభా ప్రకారం సంపద పంపిణీ జరగలన్నది రాహుల్‌ గాంధీ ఆలోచన అన్నారు.


అందుకే కులగణనను కాంగ్రెస్‌ ప్రాధాన్య అంశంగా స్వీకరించిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. బీఆర్‌ఎ్‌సలో కొలువుల కొట్లాట మొదలైందని ఎంపీ చామల ఆరోపించారు. కేసీఆర్‌ రిటైర్‌ కావడంతో బీఆర్‌ఎ్‌సలో అధ్యక్ష పదవి ఖాళీ అయిందని, దాని కోసం బావబామ్మర్దులైన హరీశ్‌రావు, కేటీఆర్‌లు తన్నుకుంటున్నారన్నారన్నారు. అందులో భాగంగానే సర్కారుపై విషం చిమ్ముతూ చెరో దిక్కు ఉరుకులాడుతున్నారని విమర్శించారు. ఏదేమైనా అధ్యక్ష పదవి ఎవరికో ముందు తేల్చుకోవాలన్నారు. పది నెలల కాంగ్రెస్‌ పాలన, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపైన చర్చకు సిద్ధమా అంటూ హరీశ్‌కు సవాల్‌ విసిరారు. మీడియా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి వస్తుందనే కేటీఆర్‌, హరీశ్‌ ఎక్స్‌ వేదికగా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక సదర్‌ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామంటూ ఇచ్చిన మాటను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలోని యాదవుల తరఫున సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 03:25 AM