Share News

Mujra Party: ఫామ్ హౌస్‌లో రెచ్చిపోయిన ఢిల్లీ అమ్మాయిలు.. చివరకు..

ABN , Publish Date - Jul 09 , 2024 | 10:40 AM

మొయినాబాద్‌(Moinabad)లోని ఓ ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీ(Mujra Party)ని ఎస్ఓటీ పోలీసులు(SOT police) భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.

Mujra Party: ఫామ్ హౌస్‌లో రెచ్చిపోయిన ఢిల్లీ అమ్మాయిలు.. చివరకు..

రంగారెడ్డి: మొయినాబాద్‌(Moinabad)లోని ఓ ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీ(Mujra Party)ని ఎస్ఓటీ పోలీసులు(SOT police) భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీలంగా అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.


రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల నిర్మూలన, రేవ్ పార్టీలు, వ్యభిచారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా తప్పుడు పనులు చేసే వారు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్, ఈ-సిగరెట్స్, గంజాయి వంటివి సరఫరా చేస్తున్న వారిని గుర్తించేందుకు టీ న్యాబ్ సైతం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక హైదరాబాద్ నగరంలోని పబ్బుల్లోనూ ఇటీవల డ్రగ్స్ తీసుకుని యువత పట్టుపడుతున్నారు. ఇందులో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ట్ పెద్దఎత్తున ఉంటున్నారు. ప్రభుత్వం మరింత దృష్టిపెట్టి గంజాయి, డ్రగ్స్, రేవ్, ముజ్రా పార్టీలపై ఉక్కుపాదం మోపాలని పలవురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:

Students Protest: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఎందుకంటే?

Updated Date - Jul 09 , 2024 | 11:22 AM