Rani Rudramadevi: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. అయితే..
ABN , Publish Date - Nov 16 , 2024 | 07:42 AM
మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, ఇష్టారాజ్యంగా పేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి(Rani Rudramadevi) హెచ్చరించారు. శుక్రవారం బర్కత్‌పురలో బీజేపీ నగర కార్యాలయంలో సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు, కార్పొరేటర్లు కన్నె ఉమాదేవి, వై.అమృతతో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
- పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం
- నేటి నుంచి బాధితులతో కలిసి బీజేపీ నేతల బస
- రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి
హైదరాబాద్: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే.. ఇష్టారాజ్యంగా పేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి(Rani Rudramadevi) హెచ్చరించారు. శుక్రవారం బర్కత్‌పురలో బీజేపీ నగర కార్యాలయంలో సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు, కార్పొరేటర్లు కన్నె ఉమాదేవి, వై.అమృతతో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: వామ్మో.. మంత్రి పొన్నం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
మూసీ సుందరీకరణను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని ఈ నెల 16 నుంచి మూసీ పరివాహక 22 ప్రాంతాలలో బీజేపీ నేతలు బాధితులతో కలిసి నిద్రిస్తున్నారని, సీఎంకే దమ్ముంటే బుల్డోజర్లతో మమ్ములను తొక్కించాలని సవాల్ విసిరారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 నుంచి 17వ తేదీ ఉదయం 9 గంటల వరకు అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలోని తులసీరామ్‌నగర్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు, కమలానగర్‌లో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, శాస్త్రినగర్‌లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్, అంబేడ్కర్‌నగర్‌లో మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్ మూసీ బాధితులతో కలిసి బస చేస్తారని పేర్కొన్నారు.
మిగత 18 ప్రాంతాలలో కూడా బీజేపీ నేతలు బస చేస్తారని తెలిపారు. మంత్రులు దక్షిణ కొరియా వెళ్లారు.. దేశంలో ఉన్న సబర్మతిని ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. సమావేశంలో ఓబీసీ మోర్చా నగర ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్, బీజేపీ గోల్నాక డివిజన్ అధ్యక్షుడు మూల రవీందర్‌గౌడ్ త దితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్ ఓ రాబందు..
ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు
ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి
Read Latest Telangana News and National News