Share News

Rare Bird: కడెం అడవుల్లో అరుదైన పచ్చపిట్ట !

ABN , Publish Date - Dec 16 , 2024 | 04:50 AM

ఎర్రటి కళ్లకు చుట్టూ కాటుక పెట్టినట్లు.. ముక్కుకు గులాబీ రంగు వేసినట్లు.. నలుపు, పసుపు పచ్చని రంగులను కలబోసుకుని ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరుదైన పక్షి పేరు ‘గోల్డెన్‌ ఓరియోల్‌’.

Rare Bird: కడెం అడవుల్లో అరుదైన పచ్చపిట్ట !

ఎర్రటి కళ్లకు చుట్టూ కాటుక పెట్టినట్లు.. ముక్కుకు గులాబీ రంగు వేసినట్లు.. నలుపు, పసుపు పచ్చని రంగులను కలబోసుకుని ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరుదైన పక్షి పేరు ‘గోల్డెన్‌ ఓరియోల్‌’. తెలంగాణ ప్రాంతంలో ‘పచ్చపిట్ట’, ఏపీలో వంగపండు’గా పిలిచే ఈ పక్షి.. సకల జీవ జాతులకు నిలయమైన నిర్మల్‌ జిల్లా కడెం ప్రాంతంలోని కవ్వాల్‌ అభయారణ్యంలో కనువిందు చేస్తోంది. మనిషి అలికిడి వింటేనే ఆమడ దూరం పారిపోయే దీనికి బిడియం ఎక్కువని, సాధారణంగా ఏ కెమెరాలకు చిక్కదని నిపుణులు చెబుతారు. వన్యప్రాణి ప్రేమికుడు ఆదిలాబాద్‌కు చెందిన వైల్డ్‌ లైఫ్‌ ఫొటో గ్రాఫర్‌ లింగంపల్లి కృష్ణ దీన్ని తన కెమెరాలో బంధించాడు. శీతాకాలంలో దట్టమైన అడవుల్లో నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ గోల్డెన్‌ ఓరియోల్‌ దర్శనమిస్తుందని కృష్ణ చెబుతున్నారు.

- ఖానాపూర్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 16 , 2024 | 04:50 AM